మురుగదాస్‌ నెక్ట్స్‌ మూవీ ఎవరితోనంటే.!

By iQlikMovies - December 07, 2018 - 13:49 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవల మురుగదాస్‌ తమిళ హీరో విజయ్‌తో 'సర్కార్‌' సినిమాని తెరకెక్కించారు. పలు వివాదాల నడుమ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా మురుగదాస్‌ తదుపరి చిత్రం కూడా విజయ్‌తోనే అని కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. విజయ్‌తో ఆల్రెడీ మూడు బ్లాక్‌ బస్టర్స్‌ కొట్టాడు మురగదాస్‌. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌కి రంగం సిద్ధం చేస్తున్నాడట. విజయ్‌ - మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'తుపాకి' సినిమా సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు విజయ్‌తోనే 'తుపాకి' సీక్వెల్‌ తీయనున్నాడట మురుగదాస్‌. ఆల్రెడీ ఈ సీక్వెల్‌కి సంబంధించి కథ సిద్ధంగా ఉందట. అయితే డైరెక్టర్‌గా తన తొలి సినిమా హీరో అజిత్‌తో మురుగదాస్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ సరైన స్క్రిప్టు దొరకట్లేదట. కానీ ఖచ్చితంగా ఈ కాంబోలో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు మురుగదాస్‌. 2001లో 'దీనా' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు మురుగదాస్‌.

అజిత్‌, లైలా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం పక్కా యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా రూపొందింది. సురేష్‌గోపి కీలక పాత్ర పోషించారీ సినిమాలో. ఆ తర్వాత ఈ కాంబోలో మూవీ సెట్‌ కాలేదు. యాక్షన్‌ హీరోగా ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూస్కెళ్తున్నాడు అజిత్‌. అజిత్‌కి సరిపడా అదిరిపోయే స్క్రిప్టును తయారు చేసే పనిలో మురుగదాస్‌ ఉన్నారట. త్వరలోనే ఈ కాంబో సెట్‌ కానుందనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS