రెడ్‌ హాట్‌ బికినీలో 'పైసా వసూల్‌'

మరిన్ని వార్తలు

బాలకృష్ణ సరసన 'పైసావసూల్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముస్కాన్‌ సేథి గుర్తుందా? పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఒక్క సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరపైనుంచి అదృశ్యమైపోయింది. అయితేనేం, సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలతో ఎప్పటికప్పుడు హల్‌చల్‌ చేస్తూనే వుంది. తాజాగా ఈ బ్యూటీ, ఇదిగో ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆల్‌ టెర్రెయిన్‌ వెహికిల్‌పై టూ పీస్‌ బికినీలో దర్శనమిస్తూ అందరికీ పెద్ద షాకే ఇచ్చింది ముస్కాన్‌ సేథి. 'అందం చూడవయా.. ఆనందించవయా..' అంటోన్న ఈ బ్యూటీ, ఓ యాడ్‌ ఫిలిం షూట్‌ సందర్భంగా ఇలా దర్శనమిచ్చిందట. ఎక్కువగా వరల్డ్‌ టూర్స్‌ని ఇష్టపడ్తానని అంటోంది ముస్కాన్‌ సేథి. మోడలింగ్‌, సినిమాలు తనకు రెండు కళ్ళనీ, మంచి అవకాశాలు వస్తే, తెలుగు సినిమాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధంగా వుంటానని చెబుతోంది ఈ రెడ్‌ హాట్‌ బికినీ భామ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS