'పైసా వసూల్' సినిమాతో డెబ్యూ చేసిన ముద్దుగుమ్మ ముస్కాన్ సేథి. తొలి సినిమాకే బాలయ్య లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ, తర్వాత ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ పిక్స్‌తో షాకిస్తుంటుంది. పోత పోసిన శిల్పంలా ఉండే ముస్కాన్ అందానికి నెటిజన్లు ఫిదా అవుతారు కానీ, దర్శక, నిర్మాతల దృష్టికి మాత్రం ముస్కాన్ అందాలు చేరడం లేదు. అసలే హీరోయిన్స్ కొరత ఉన్న మన టాలీవుడ్లో ముస్కాన్ లాంటి అందాల భామలను కాస్త యూజ్ చేసుకోవచ్చుగా.
ఇక తాజాగా అందాల ముస్కాన్ బేబీ సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేసింది. బ్లూ కలర్ షార్ట్ ట్రాక్ డ్రస్సులో తేలికపాటి బరువుల్ని రెండు చేతుల్లోనూ మోస్తూ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న పిక్ ఇది. ముఖంలో ఆమె చిరునవ్వు చూస్తుంటే, అరె వెయిట్ పెద్దగా లేదే అని హింట్ ఇస్తున్నట్లుంది. అయినా అంతకు మించి బరువులు మోయాల్సిన అవసరం కూడా ఈ అమ్మడికి లేదేమో. ఎందుకంటే నాజూకు శరీరం, ఉండాల్సిన అందాలు ఈ ముద్దుగుమ్మకు ఉండాల్సిన పాళ్లలో ఉన్నాయి మరి.