అటు వైపు చూడనంటోన్న తెలుగమ్మాయ్‌!

మరిన్ని వార్తలు

అవకాశం రావాలే కానీ, బాలీవుడ్‌లో నటించాలని ఏ ముద్దుగుమ్మకు ఉండదు చెప్పండి. కానీ, పదహారణాల తెలుగమ్మాయ్‌ అంజలి మాత్రం అవకాశం వచ్చినా బాలీవుడ్‌కి వెళ్లనంటోంది. అచ్చమైన తెలుగమ్మాయి అయినా, తెలుగులో కన్నా, తమిళంలో స్టార్‌డమ్‌ సంపాదించింది అంజలి. కానీ, తెలుగు సినిమాల్లోనూ అప్పుడప్పుడూ నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో అంజలి నటిస్తోంది.

 

అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన 'గీతాంజలి' మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ఆ సీక్వెల్‌లోనూ అంజలి నటిస్తోంది. అలాగే 'సైలెన్స్‌' మూవీలోనూ అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో అంజలితో పాటు, షాలినీ పాండే కూడా ఇతర కీలక పాత్ర పోషిస్తోంది. తమిళంలోనూ అంజలి నటిస్తున్న రెండు చిత్రాలూ నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా అంజలి నటించిన 'సింధూబాద్‌' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది.

 

'బాహుబలి' నిర్మాతలతో ఈ సినిమా నిర్మాతలకు మధ్య మనీ డిఫరెన్సెస్‌ కారణంగా విడుదల పోస్ట్‌ పోన్‌ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే అంజలి తన మనసులోని మాటల్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ మధ్య చిన్న అవకాశమొచ్చినా బాలీవుడ్‌కి గెంతుకుంటూ వెళ్లిపోతున్న హీరోయిన్లను చాలా మందిని చూస్తున్నాం. ఈ తరుణంలో మన పక్కింటమ్మాయి అంజలి మాత్రం తాను బాలీవుడ్‌కి వెళ్లనని తెగేసి చెబుతుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS