మై లవ్‌.. ఫ్రమ్‌ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌': సమ్‌థింగ్‌ స్పెషల్‌.

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమా నుంచి 'మై లవ్‌' అంటూ సాగే సాంగ్‌ లిరికల్‌ వీడియో విడుదలయ్యింది. మోలోడియస్‌గా సాగే ఈ పాటలో మ్యూజిక్‌ చాలా కొత్తగా వుంది. లిరికల్‌ సాంగ్‌ కోసం ఉపయోగించిన విజువల్స్‌ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీజర్‌ పెను సంచలనాలకి తెరలేపిన విషయం విదితమే. విజయ్‌ దేవరకొండ మార్క్‌ రగ్‌డ్‌ థీమ్‌ టీజర్‌లో కన్పించింది. అయితే, దానికి భిన్నంగా చాలా ప్లెజెంట్‌గా 'మై లవ్‌' సాంగ్‌ లిరికల్‌ వీడియోని రూపొందించినట్లు తెలుస్తోంది. గోపీ సుందర్‌ మ్యూజిక్‌ చాలా బావుంది. లిరిక్స్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుండడం గమనార్హం. ఓవరాల్‌గా ఆల్బమ్‌లో మంచి సాంగ్‌లా ఇది ఎక్కువ మార్కులు పొందేందుకు వీలుంది.

ఇలా లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యిందో లేదో అలా దీన్ని వైరల్‌ చేయడానికి రౌడీస్‌.. అదేనండీ విజయ్‌ దేవరకొండ అభిమానులు రెడీ అయిపోయారు. ఇదిలా వుంటే, విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'ఫైటర్‌' సినిమా ఈ రోజు ముంబైలో షూటింగ్‌ ప్రారంభించుకున్న విషయం విదితమే. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' విషయానికొస్తే, ఈ సినిమాలో విజయ్‌ సరసన రాశి ఖన్నా, కేథరీన్‌ ట్రెసా, ఐశ్వర్య రాజేష్‌, ఇసాబెల్లె హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS