పింక్‌ రీమేక్‌: వైరల్‌గా మారిన పవన్‌ లుక్‌!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమైన జనసేనాని, బాలీవుడ్‌ సినిమా 'పింక్‌' తెలుగు రీమేక్‌ వెర్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. నిన్న మొన్నటిదాకా పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా చేయనుండడంపై రకరకాల వార్తలు విన్పించాయి. పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా చేయడంలేదంటూ ప్రచారం జరిగింది కూడా. అయితే, తాజాగా పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా షూట్‌లో పాల్గొనడానికి సంబంధించి కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి. షూటింగ్‌ లొకేషన్స్‌ నుంచి లీక్‌ అయిన ఫొటోల్లో పవన్‌ కళ్యాణ్‌ షరామామూలుగానే చాలా స్టైలిష్‌గా దర్శనమిస్తుండడం గమనార్హం.

 

ఇప్పటిదాకా ప్రచారం జరిగినట్లే, పవన్‌ కళ్యాణ్‌ తన గడ్డం తీయకుండానే సినిమా షూట్‌లో పాల్గొంటున్నారు. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన లాయర్‌ రోల్‌ ఇది. ఇదే సినిమాని తమిళంలో అజిత్‌ హీరోగా 'నేర్కొండ పార్వాయ్‌' పేరుతో రూపొందించారు. తెలుగులో 'లాయర్‌ సాబ్‌' అనే టైటిల్‌ అనుకుంటున్నారు. బాలీవుడ్‌లో తాప్సీ నటించగా, తెలుగు వెర్షన్‌ కోసం పూజా హెగ్దేతో సంప్రదింపులు జరుగుతున్నాయట. మరోపక్క అంజలి, నివేదా థామస్‌ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తుండగా, దిల్‌ రాజు - బోనీ కపూర్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS