నిరాధారమైన అసత్య ఆరోపణలు: మైత్రి మూవీస్

మరిన్ని వార్తలు

‘ఆచార్య’పై రాజేష్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు అసత్యమని, మేము అతని కథకు అన్నయ్య అనే పేరు పెట్టాలని కొరటాల శివకు తెలియజేశామని చెప్పడం అబద్దమని, అతని ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నమని తెలియజేశారు మైత్రిమూవీ మేకర్స్‌ సంస్థ. గతంలో మేము నూతన దర్శకులలో డియర్‌కామ్రేడ్‌ (భరత్‌కమ్మ), మత్తువదలరా (రితేష్‌రానా), ప్రస్తుతం ‘ఉప్పెన’ (బుబ్చిబాబు సానా) సినిమాలను నిర్మించాం. రాజేష్‌ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం.

 

కథ బాగాలేకపోవడంతో అతని కథను తిరస్కరించాం. ఇక బాలేని కథతో వేరే వారికి సినిమా నిర్మించాలని ఎందుకు చెబుతాం? దర్శకుడిగా, రచయితగా కొరటాల శివ ప్రతిభ గురించి అందరికి తెలుసు. కమర్షియల్‌ అంశాలతో పాటు తన ప్రతి సినిమాలో సామాజిక ప్రయోజనం కూడా జోడించే కొరటాల శివ గారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అర్థరహితమైన ఆరోపణలు చేయడం సరికాదు.మీడియాలో రాజేష్‌ చేసిన ఆరోపణలు ఖండించడంతో పాటు ఆయనపై తగిన చర్చలు తీసుకుంటాం. రాజేష్‌ చేసిన చౌకైన జమ్మికులను అతని ఆరోపణలను అందరూ విస్మరించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.

acharya story issue


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS