కళ్యాణ్‌రామ్ - తమన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'నా నువ్వే'. ఇటీవల ఈ సినిమా సంచలనంగా మారింది. ఫస్ట్‌లుక్‌తోనే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేసింది కళ్యాణ్‌రామ్ - తమన్నా జంట. ఇక ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.
ముఖ్యంగా తమన్నా సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. కొంచెం బొద్దుగా ముద్దుగా, ఇప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త హీరోయిన్‌లా చాలా కొత్తగా కనిపిస్తోంది ఎందుకో తమన్నా ఈ సినిమాలో. ఇకపోతే కళ్యాణ్‌రామ్‌తో తమన్నా తొలిసారి జత కడుతున్న చిత్రమిది. వీరిద్దరి మధ్యా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. జస్ట్ ట్రైలర్‌లోనే ఇలా ఉంటే సినిమా మొత్తం వీరింకెలా కట్టిపడేసి ఉంటారోనంటూ ఆడియన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల జూన్ 1కి వాయిదా పడింది. సినిమా తెరపై రిచ్‌గా కనిపించేందుకు విజువల్‌గా చాలా చాలా మ్యాజిక్స్ చేస్తున్నారట. అవును ట్రైలర్‌లోనే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్‌ని మిక్స్ చేశారు. అయితే సినిమాలో అలాంటి మెస్మరైజింగ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయట. అందుకోసమే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తాజాగా అందిన సమాచారమ్.
ఏది ఏమైనా వచ్చే నెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూల్ అండ్ లవ్‌లీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జయేంద్ర తెరకెక్కిస్తున్నారు.