ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు కళ్యాణ్ రామ్-తమన్నా జంటగా వచ్చిన నా నువ్వే & సుధీర్ బాబు-అదితి రావు హైదరి లు నటించిన సమ్మోహనం, ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని ఎంతలా ఆకట్టుకుంటున్నాయి అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి ప్రదర్శనని కనబరుస్తున్నాయి అన్నది ఇప్పుడు చదువుదాం..
ముందుగా నా నువ్వే గురించి మాట్లాడుకుంటే- కళ్యాణ్ రామ్ మొదటిసారిగా తన కెరీర్ లోనే ఒక లవర్ బాయ్ గా నటించడం ఆ పాత్ర కోసం లుక్ కూడా మార్చుకున్నాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, దీనిలో సినిమా ఫీలింగ్ కన్నా ఒక యాడ్ ఫిలిం లక్షణాలే ఎక్కువగా కనిపించాయి. ఈ చిత్రం మొత్తం కళ్యాణ్ రామ్-తమన్నా ల మధ్య జరిగే ‘విధిరాత’ అనే అంశాన్ని చుట్టూ కథని నడిపించే ప్రయాణం చేశాడు దర్శకుడు జయేంద్ర.
అయితే ఇందులో పాత్రల మధ్య భావోద్వేగాలు అంతగా పలకలేదు, ముఖ్యంగా లీడ్ పెయిర్ మధ్య ప్రేమికులు అనే ఫీల్ తెరపైన మనకి కనిపించదు. ఇదే పెద్ద లోపం అని చెప్పొచ్చు, దీనికి తోడు కథనం కూడా చాలా బలహీనంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చలేదు. దీనితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తొలిరోజే బోర్లా పడింది అని చెప్పక తప్పదు.
ఇక రెండవ చిత్రం అయిన సమ్మోహనం గురించి మాట్లాడుకుంటే- ఇది రచయిత & దర్శకుడు అయిన మోహనకృష్ణ ఇంద్రగంటి కలం నుండి జారువాలిన మరో మంచి చిత్రం అని చెప్పొచ్చు. ప్రాధాన పాత్రల్లో అదితి రావు-సుధీర్ బాబు సహాయ పాత్రల్లో నరేష్-పవిత్ర లోకేష్ లు చాలా చక్కగా అభినయించారు.
మామూలు కథకి మంచి కథనం, సంభాషణలు తోడవ్వగా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తున్నది. ఇక ఈ చిత్ర విజయంలో అగ్రతాంబూలం దక్కాల్సింది దర్శకుడికే... ఈ చిత్రం టాక్ మొదటి షో నుండే పాజిటివ్ గా వస్తుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మాయ చేస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.