స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాల్ని పదింతలు చేసింది ఈ ట్రైలర్. జైల్లో ఆర్మీ ఆఫీసర్‌గా బన్నీ, ఓ ఖైదీకి బిర్యానీ తెచ్చివ్వడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఖైదీ బిర్యానీ చాలా బాగుందని ఆ ఖైదీ అంటాడు. ఇదే లాస్ట్ బిర్యానీ, తిన్నాక నిన్ను చంపేస్తానని బన్నీ చెబుతాడు.
అలా స్టార్ట్ అయిన ట్రైలర్‌లో సీనియర్ స్టార్ అర్జున్, శరత్ కుమార్, బొమన్ ఇరానీ, రావురమేష్, నదియా తదితర కీలక పాత్రధారులు సహా హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఇతరత్రా పాత్రధారులకు చోటు దక్కింది. హెవీ యాక్షన్‌తో పాటు, రొమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారు. 'నాకు కోపమొచ్చినప్పుడు బూతులే వస్తాయి, మంత్రాలు రావు..' అని బన్నీ హీరోయిన్‌పై కోప్పడడం. చివర్లో శరత్‌కుమార్ నీకు ఏం కావాలిరా.. అని అడిగితే ఇండియా కావాలి, ఇచ్చేయ్ అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
నరనరాల దేశభక్తి జీర్ణించుకుపోయిన ఆర్మీ యువకుడిగా బన్నీ నటన ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్‌ని ట్రైలర్‌లో ఎక్కువగానే కట్ చేశారు. యాక్షన్‌కి బాగా ఫ్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 1న విడుదల చేసిన ఫస్ట్ ఇంపాక్ట్‌లో ఆర్మీలో శిక్షకుడిగా బన్నీ ఎంత కష్టపడ్డాడో చూపించారు. దేశభక్తితో ఆ దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఓ స్ట్రిక్ట్ ఆర్మీ ఆఫీసర్‌గా ట్రైలర్‌లో చూపించారు. మొత్తానికి ట్రైలర్‌తో బన్నీ చాలా ఇంపాక్ట్ ఇచ్చాడు అభిమానులకు. వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.