డార్లింగ్స్‌ అందరికీ బిగ్‌ హగ్‌

By iQlikMovies - April 28, 2018 - 18:17 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమా సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులందరికీ బిగ్‌ హగ్‌ ఇస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు. సంవత్సరం పూర్తైనా 'బాహుబలి' సినిమా ఇంపాక్ట్‌ ఇంకా అలాగే ఉంది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా 'బాహుబలి'. బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలకు పోటీగా, అంతకు మించి అనే స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టింది. ఈ వసూళ్లను నిన్న మొన్నటి వరకూ అక్కడ ఏ సినిమా అందుకోలేకపోయింది ఆ తర్వాత.

 

అంతగా కీర్తి ఘడించినంది మన 'బాహుబలి'. తెలుగు సినిమా స్టామినా ఇది అని ప్రూవ్‌ చేసింది. అలాగే చైనా వంటి దేశాల్లో కూడా బాహుబలి సత్తా చాటింది. ఈ సినిమాతో ప్రబాస్‌ యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయాడు. దర్శక దిగ్గజం రాజమౌళి సృష్టించిన ఈ దృశ్య కావ్యం గతేడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రబాస్‌తో పాటు, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో. ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న చిత్రం 'బాహుబలి'.

 

ఇటీవల జాతీయ అవార్డు పురస్కారాల్లో కూడా స్పెషల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కింద 'బాహుబలి'ని అవార్డు వరించింది. ఇలాంటి అవార్డులు ఒక్కటేమిటి, చాలా చాలా 'బాహుబలి' ఖాతాలో చేరాయి. ఈ సినిమా కోసం ఏకంగా ఐదేళ్లు ప్రబాస్‌ మరో సినిమాకి సైన్‌ చేయకుండా ఉండిపోయాడు. ఆ సినిమా తర్వాత ప్రబాస్‌ 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్‌ చిత్రమే. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ ఈ సినిమాలో ప్రబాస్‌తో జోడీ కడుతోంది. సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS