నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ‘ఇంపాక్ట్’ అదుర్స్

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఇంపాక్ట్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అందరు ఊహించినట్టుగానే ఈ ‘ఇంపాక్ట్’ అదిరింది అనే చెప్పాలి. ఒక సైనికుడు పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు అనే చెప్పొచ్చు.

ఇక ఈ ఇంపాక్ట్ విషయానికి వస్తే, సూర్య పాత్రని దర్శకుడు వక్కంతం వంశీ ఈ ఇంపాక్ట్ ద్వారా చూపెట్టాడు అని చెప్పొచ్చు. అలాగే ఒక మిలిటరీ ఆఫీసర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? దానికి ఎంతలా కష్టపడ్డాడు అన్నది చూడొచ్చు. అయితే అతని పాత్రకి కోపమేక్కువ అని కూడా మనం చూడొచ్చు.

అలాగే ఈ ఇంపాక్ట్ లో డైలాగ్స్ కూడా హీరో పాత్రని ఎలివేట్ చేసేలా దర్శకుడు ప్రయత్నం ఉంది. బోమన్ ఇరానీ, రావు రమేష్ వంటి భారీ తారాగణం కూడా ఈ ఇంపాక్ట్ లో చూడొచ్చు. ఇక వక్కంతం వంశీ దర్శకుడిగా తన మొదటి చిత్రాన్ని చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేసినట్టు ఈ ఇంపాక్ట్ చూస్తే అర్ధమవుతుంది. 

మొత్తానికి ఈ ‘ఇంపాక్ట్’ కచ్చితంగా ప్రేక్షకుల పైన ‘ఇంపాక్ట్’ చూపించేవిధంగానే ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS