'బాహుబలి' సినిమాతో భళ్లాలదేవగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి, యూనివర్సల్‌గా మెప్పు పొందాడు రానా. హీరోగానే కాకుండా, విభిన్న పాత్రలకూ పెట్టింది పేరు రానా. ఇటు తెలుగులోనే కాదు, హిందీలో కూడా రానా హవా కొనసాగుతోంది. ఈ మధ్యనే హాలీవుడ్‌కి కూడా రానా ప్రయాణం సాగుతోంది. హాలీవుడ్లో రానా ఓ సినిమాలో నటిస్తున్నాడనీ సమాచారమ్.
ఇదిలా ఉండగా, తాజాగా రానా హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. అదే 'హాథీ మేరీ సాథీ'. అప్పుడెప్పుడో రాజేష్ ఖన్నా హీరోగా తెరకెక్కిన 'హాథీ మేరీ సాథీ' చిత్రం గుర్తుండే ఉంటుంది. అదే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం, ఆ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రభు సోలోమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేష్ ఖన్నా పాత్రలో రానా నటిస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది.
ఈ లుక్‌లో ఓ పెద్ద ఏనుగు, దాని దంతాలను పట్టుకుని రానా నిలబడి చూస్తున్నాడు. లుక్ చాలా డిఫపరెంట్గా ఉంది. డిఫరెంట్ కాస్ట్యూమ్‌తో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. అప్పటి 'హాథీ మేరీ సాథీ' లో తనూజ హీరోయిన్గా నటించగా, ఈ సినిమా కోసం హీరోయిన్గా పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 'భళ్లాలదేవ'గా అలరించిన రానా, 'ఘాజీ'తో ఆకట్టుకున్నాడు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో డిఫరెంట్ యాంగిల్‌ని చూపించాడు. ఇప్పుడు సరికొత్త గెటప్‌లోకి మారిపోయాడు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరో పక్క రానా హీరోగా '1948' అనే చిత్రం తెరకెక్కుతోంది.