నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కలెక్షన్స్

By iQlikMovies - May 05, 2018 - 17:23 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి విడుదల రోజే మిక్స్డ్ టాక్ రావడంతో అందరు ఈ చిత్రం మొదటిరోజు కలెక్షన్స్ పైన ఆసక్తి నెలకొంది.

ఇక అందుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కలెక్షన్స్ మొదటిరోజు సుమారు రూ 40 కోట్ల (గ్రాస్) వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సుమారు రూ 20 కోట్ల (షేర్) వచ్చినట్టుగా సమాచారం.

 

ఈ తరుణంలో, టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబట్టే స్థాయికి అల్లు అర్జున్  స్టార్ స్టామినా పెరిగినట్టుగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈరోజు రేపు వచ్చే కలెక్షన్స్ బట్టి ఈ సినిమా కమర్షియల్ స్టామినాని అంచనా వేయవచ్చు.

మరి ఈ మూడు రోజుల్లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎంత వసూలు చేయనుందో..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS