సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిక్షణాల్లో పెళ్ళి చేసుకోబుతున్న తన అభిమానికి ఒక చిన్నపాటి షాక్ ఇచ్చాడు అనే చెప్పాలి.
పూర్తి వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని హైదర్ నగర్ ప్రాంతంలో ఒక వివాహం వేడుకలోని పెళ్ళి కూతురికి ఒక షాక్ లాంటి సర్ప్రైజ్ తగిలింది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే- మహేష్ వీరాభిమాని అయిన పెళ్ళి కూతురికి స్వయంగా మహేష్-నమ్రత దంపతులు సంతకం చేసిన గ్రీటింగ్ కార్డుని బహుమతిగా పంపించడం జరిగింది.
ఊహించని ఈ సంఘటనకి పెళ్ళి కూతురు ఆమె కుటుంబసభ్యులు అందరూ ఒక్కసారి షాక్ అవ్వడమే గాక అసలు ఇది ఎలా సాధ్యమైందో తెలియక ఆలోచనలో పడ్డారు. అసలు జరిగిందేంటి అంటే, పెళ్ళి కూతురు సూపర్ స్టార్ మహేష్ బాబు కి వీరాభిమాని అని తమ PRO టీం ద్వారా తెలుసుకున్న మహేష్ దంపతులు ఇలా గ్రీటింగ్ పంపి ఆమెకి తన పెళ్ళిని మరింత జ్ఞాపకంగా మార్చేశారు.
ఏదేమైనా మహేష్ బాబు చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.