కంగారు పడకండి తెలుగులో కాదు, తమిళంలో. అందాల రెజీనా తమిళంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ చంద్రమౌళి' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకే రెజీనా తమిళంలో డబ్బింగ్ చెప్పింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమిళంలో తొలిసారి డబ్బింగ్ చెప్పుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పింది రెజీనా.
ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం రెజీనా హాట్ హాట్ ఎక్స్‌పోజింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమోస్ సినిమా ప్రమోషన్స్‌లో సంచలనంగా మారాయి. ఇకపోతే తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించిన రెజీనా ఇంతవరకూ డబ్బింగ్ చెప్పలేదు. కానీ త్వరలోనే తెలుగులో కూడా డబ్బింగ్ చెబుతానని అంటోంది. రెజీనా తెలుగు కూడా బాగానే మాట్లాడుతుంది. అయితే డబ్బింగ్ చెప్పే సాహసం ఇంతవరకూ చేయలేదు. కానీ త్వరలోనే ఆ ముచ్చట తీర్చుకుంటానంటోంది.
ఇటీవల తెలుగులో 'అ' చిత్రంలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పోషించింది రెజీనా. ప్రస్తుతం తెలుగులో రెజీనాకి పెద్దగా ఆఫర్లు లేవు. కానీ తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తోంది. అలాగే హిందీలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది రెజీనా. నటనతో పాటు, ఎక్స్‌పోజింగ్‌లోనూ రెజీనాకి అడ్డుగోడలు లేవు. యాక్టింగ్ టాలెంట్‌తో పాటు, గ్లామరస్‌గా కనిపించడంలోనూ తనదైన స్టైల్ ప్రదర్శిస్తుంది.
అయితే రెజీనా తాజా చిత్రం 'మిస్టర్ చంద్రమౌళి'లో ఆకాశమే హద్దు అన్న రీతిలో అందాలారబోసేసిందని చెప్పుకుంటున్నారు. ఆ టాకే ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టేస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.