సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై హాట్ హాట్‌గా సోయగాల్ని ఒలకబోసేసిన ఈ భామ ఎవరో తెలుసా? అదనండీ మన బంటీగాడు నటిస్తోన్న సినిమా.. 'అదుగో' హీరోయిన్. రవిబాబు రూపొందించిన 'అదుగో' సినిమాలో నటించిన ఈ భామ, మరో తెలుగు మూవీతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే 'నన్ను దోచుకుందువటే'. సుధీర్‌బాబు హీరోగానటిస్తున్న సినిమా ఇది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాన్ని మించి ఇంకోటి.. అన్నట్లుగా నభా నటేష్ తెలుగులో అవకాశాలు బాగానే కొల్లగొట్టేస్తోంది. ఎందుకు కొల్లగొట్టేయదూ, అందం.. దాంతోపాటే అభినయం.. వెరసి ఈ బ్యూటీ తెలుగులో హీరోయిన్‌గా సెటిలైపోయేలానే వుంది. తొలి సినిమా 'అదుగో' ఇంకా రిలీజ్ అవలేదు. రెండో సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. రెండు సినిమాలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనున్నాయి. అంటే ఈ బ్యూటీ డబుల్ కిక్ ఇవ్వబోతోందన్నమాట.
ALSO SEE :
Qlik Here For The Gallery of Nabha Natesh