కమెడియన్‌గా తన టైమింగ్‌తో పిల్లల నుండి పెద్దల దాకా అందరి ప్రశంసలు, మన్ననలు అందుకున్న సునీల్, హీరోగానూ తన సత్తా చాటాడు. అయితే రెండు మూడు సినిమాలతో హీరోగా రైజింగ్ ప్రదర్శించిన సునీల్ తర్వాత డీలా పడ్డాడు. ఎంత ప్రయత్నించినా నిలదొక్కుకోవడం కష్టమైపోయింది. దాంతో మళ్లీ రూటు మార్చేశాడు. కమెడియన్ అవతారమెత్తేశాడు.
ఇటీవల 'సిల్లీ ఫెలోస్'లో అల్లరి నరేష్‌తో కలిసి నటించాడు. సునీల్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు ఈ సినిమాతో. అవును సునీల్ నువ్వు ఇలా కనిపిస్తేనే నచ్చుతావ్ అని ఆడియన్స్ నోట పలికించేలా చేసుకున్నాడు. అయితే ఇక సునీల్ మళ్లీ కమెడియన్‌గా సెటిలైపోతాడా? అంటే కాదంట. హీరోగానూ మంచి కథలు తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. అయితే ఈ సారి మాత్రం హీరోగా త్యాగాలు, సందేశాల జోలికి పోనంటున్నాడు. హాయిగా నవ్వించే కథలనే ఎంచుకుంటానంటున్నాడు.
'సిల్లీ ఫెలోస్'లో హి ఈజ్ బ్యాక్ అనిపించుకున్న సునీల్‌కి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట కమెడియన్‌గా. ఆల్రెడీ ఎన్టీఆర్ 'అరవింద సమేత..'లో సునీల్ నటిస్తున్నాడు. ఇది ఫన్ జనరేటింగ్ అండ్ మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తోంది. అలాగే శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న 'ఆపరేషన్ 2019' చిత్రంలోనూ సునీల్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ ఎవ్వరూ ఊహించని షాకింగ్ రోల్‌లో కనిపిస్తానని అభిమానులకు చెబుతున్నాడు. అంటే ఇది కామెడీ రోల్‌నా? లేక ఇంపార్టెంట్ రోల్‌నా? అనేది సస్పెన్స్.
కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సునీల్‌కి ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆల్రెడీ ఆ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారట. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సునీల్‌తో పాటు మంచు మనోజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.