‘కొంచెం స్టార్టింగ్‌ ప్రాబ్లమ్‌..’ అంటోన్న ఇస్మార్ట్ నభా నటేష్.!

మరిన్ని వార్తలు

ఇండస్ట్రీలో కొనసాగాంటే, చిన్నపాటి స్నేహమైనా అల్లుకుపోవాలి. అలాంటిది ఫ్రెండ్స్‌తో స్టార్టింగ్‌ ప్రాబ్లెమ్‌ అంటుందేంటండీ.. ఈ ముద్దుగుమ్మ! ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అనుకుంటున్నారా.? ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌. ఈ భామకు ఫ్రెండ్స్‌ చాలా తక్కువట. ఆన్‌ స్క్రీన్‌ అంత చలాకీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ పర్సనల్‌ లైఫ్‌లో కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటుందట. ముఖ్యంగా ఎవరితోనైనా స్నేహం చేయాలంటే స్టార్టింగ్‌ ప్రాబ్లెమ్‌ అంటోంది. తన పని తాను చూసుకుని వెళ్లిపోవడమే తప్ప, ఎవరితోనైనా మాట్లాడాలంటే తనకు కొంచెం కష్టంగా ఉంటుందట. సో అలా ఇంతవరకూ ఇండస్ట్రీలో ఎవరితోనూ పెద్దగా పరిచయమే కాలేదట ఈ బెంగుళూర్‌ బ్యూటీకి.

 

ఈ ఏడాది ‘డిస్కో రాజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆశించిన రిజల్ట్‌ అందుకోలేదు. కానీ, పూజా హెగ్దే, రష్మిక తదితర టాప్ లీగ్ హీరోయిన్ల తర్వాత ఎంతో కొంత చెప్పుకోదగ్గ ఇమేజ్‌ ఈ భామకే ఉందనడం అతిశయోక్తి కాదేమో. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో ఛెంగు ఛెంగుమని లేడి లా గెంతులేస్తూ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా కనిపించిన ఈ భామ, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో వరంగల్‌ పోరిగా ఫుల్‌ డోస్‌ గ్లామర్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చి మరోసారి అందరి మనసుల్నీ దోచేసింది. మూడో సినిమాకే రవితేజ వంటి స్టార్‌ హీరో సరసన ఛాన్స్‌ కొట్టినా, సక్సెస్‌ దక్కించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ‘సోలో బతుకే సో బెటర్‌’ అంటూ హీరోయిన్‌గా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ సింగిల్‌ లైఫ్‌ని వెండితెరపై టర్న్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే మరో యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తోనూ జత కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS