ఆ సినిమా సమంతకి మరో ఛాలెంజ్‌ అట.!

మరిన్ని వార్తలు

ఛాలెంజింగ్‌ రోల్స్‌నే ఎంచుకునేందుకు చూస్తోంది ప్రస్తుతం సమంత. ఆ క్రమంలో సమంతకు మరో ఛాన్స్‌ దక్కింది. అదే విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాత్తువక్కల రెందు కాదల్‌’. విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ సినిమాలో సమంత పాత్ర కొత్తగా ఉంటుందట. అందులోనూ మరో సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతారతో పోటీ పడి నటించే పాత్ర కావడంతో, సమంత నో అనకుండా ఈ ఆఫర్‌ ఒప్పేసుకుందట. తనలోని నటికి ఈ పాత్ర మరో ఛాలెంజ్‌ విసిరేలా ఉంటుందని సమంత అంటోంది.

 

‘ఓ బేబీ’, ‘జాను’ చిత్రాలతో ఈ మధ్య సమంత నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో తెలిసిన సంగతే. అలాగే తనలోని మరో కోణాన్ని బయటికి తీసేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందంటోంది సమంత. అయితే, ఈ సినిమాలో నయన్‌ పాత్ర కన్నా, సమంత పాత్ర నిడివి తక్కువగా ఉండనుందట. కానీ, నయన్‌కు గట్టి పోటీ ఇచ్చే పాత్రనీ తెలుస్తోంది. అందుకే ఏరి కోరి ఈ పాత్ర కోసం సమంతను సంప్రదించాడట విఘ్నేష్‌ శివన్‌. తెలుగులోనూ విడుదల కానున్న ఈ సినిమా డిఫరెంట్‌ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా రూపొందనుంది. ఈ సినిమాకి తమిళ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS