'భీష్మ'తో ఓ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నితిన్. ఇప్పుడు 'రంగ్ దే', 'చెక్' సినిమాలు వరుసలో ఉన్నాయి. వీటితో పాటు `అంధాధూన్` కూడా ఒప్పుకున్నాడు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. ఓ ప్రధాన పాత్ర కోసం శిల్పా శెట్టి ఎంపిక ఖాయమైంది. కథానాయికగా నభా నటేషా పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
'నన్ను దోచుకుందువటే' చిత్రంతో టాలీవుడ్‌ని ఆకట్టుకుంది నభా. అయితే అసలు సిసలు హిట్... `ఇస్మార్ట్ శంకర్`తోనే వచ్చింది. ఆసినిమాతో మాస్‌కి బాగా దగ్గరైంది. ఇప్పుడు 'సోలో బతుకే సో బెటర్' లో సాయిధరమ్ తేజ్ తో కలసి నటిస్తోంది. ఈలోగా నితిన్ తో పనిచేసే ఛాన్స్ వచ్చింది. త్వరలోనే ఈసినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రానుంది. అందులో మరిన్ని వివరాలు తెలుస్తాయి.
ALSO SEE :
Nabha Natesh Hot Photoshoot