క్యూట్‌గా అందంగా కనిపించే బార్బీ బొమ్మలా మురిపిస్తున్న ఈ పిక్‌లోని అందాల భామ నభా నటేష్. అఫ్ కోర్స్ గుర్తు చేయక్కర్లేదనుకోండి. ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో నభా పేరు కూడా మొదటి వరుసలోనే ఉంటుంది. వరుస సినిమాలతో అబ్బో ఫుల్ బిజీగా గడుపుతోంది అమ్మడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఇస్మార్ట్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఇటీవలే మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగా మేనల్లుడు సాయి ధరవ్‌ు తేజ్‌తో ‘సోలో లైఫే సో బెటర్’ సినిమాలో జత కడుతోంది. ఇటీవలే యంగ్ హీరో బెల్లంకొండ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ‘డిస్కో రాజా’ సినిమాతో లేటెస్ట్గా ప్రేక్షకుల ముందుకొచ్చినా ఆ సినిమా రిజల్ట్ అంతగా నభాకి కలిసి రాలేదనుకోండి.
అయినా క్రేజ్ మాత్రం తగ్గే ప్రశక్తే లేదీ బ్యూటీకి. ఎందుకంటే, పాప కళలు అలా ఉన్నాయి మరి. ఇదిగో చూస్తున్నారుగా సినిమాలతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాని హీటెక్కించడం కూడా ఓ కళే అంటోంది. శాటిన్ ఫ్యాబ్రిక్‌లో బేబీ పింక్ షార్ట్ ఫ్రాక్ ధరించి ఎలా మెరిసిపోతోందో చూశారుగా. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నిజంగానే ఈ పిక్‌లో నభా సో క్యూట్ అండ్ సో హాట్ అనిపిస్తోంది.