గుర్రం కాదు, పులి మీద ‘సవారి’నే!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నందు తాజా చిత్రం ‘సవారి’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కథ ఆసక్తిగొలిపేలా ఉన్నప్పటికీ ఈ వారం రిలీజ్‌లో ఉన్న సినిమాల్లో సమంత - శర్వానంద్‌ జంటగా ‘జాను’ కూడా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సమంత సక్సెస్‌ రేట్‌ని పరిగణలోనికి తీసుకున్నా, దిల్‌ రాజు కాన్పిÛడెన్స్‌ చూస్తున్నా, ఈ సినిమాకి మంచి టాక్‌ వచ్చేలానే ఉంది. దీంతో నందు కాస్త టెన్షన్‌ పడుతున్నాడట. గతంలోనూ నందు చాలా చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ, ఆ సినిమాల విషయంలో ఎప్పుడూ పడని టెన్షన్‌ ‘సవారి’ విషయంలో ఫీలవుతున్నాడట. ఎందుకంటే, ‘సవారి’ తన కెరీర్‌లో స్పెషల్‌ మూవీ అంటున్నాడు.

 

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌, పోస్టర్స్‌.. ఇలా అన్నీ చాలా ఆసక్తిగొలిపేలా ఉన్నాయి. దాంతో ‘సవారి’పైనా ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. ఇదే వారం మరో రెండు సినిమాలు రిలీజ్‌ అవుతున్నా, ‘జాను’ తర్వాత ‘సవారి’నే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో నందు గుర్రం నడిపే కుర్రోడి పాత్రలో కనిపిస్తున్నాడు. పేదింటి కుర్రోడిలా తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకోవడం దగ్గర నుండి ఒక్కటేమిటీ ఈ పాత్ర కోసం నందు చాలా చాలా కసరత్తులు చేశాడట. అంతేకాదు, హీరోగా ఈ సినిమా సక్సెస్‌ తనకెంతో ఇంపార్టెంట్‌ అంటున్నాడు. చూడాలి మరి, నందు కోరుకున్నట్లుగా ‘సవారి’ మంచి సక్సెస్‌ని అందిస్తుందో లేదో. సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కొత్తమ్మాయి ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS