గ్లామ్‌షాట్‌: సెక్సీ పోజులో ఇలియానా 2.0!

మరిన్ని వార్తలు

అసలు సిసలు తెలుగమ్మాయిలా 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో డెబ్యూ చేసి, చాలా తక్కువ సమయంలోనే అందర్నీ దోచేసింది ముద్దుగుమ్మ నభా నటేష్‌. తొలి సినిమాలో తెలుగమ్మాయిలా కనిపించింది కానీ, స్వతహాగా కన్నడ బ్యూటీ. కన్నడలోనే ఆమె తన కెరీర్‌ని స్టార్ట్‌ చేసింది. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతోంది. తొలి సినిమాలో ట్రెడిషనల్‌గా కనిపించినా, నభాలోని అసలు సిసలు యాంగిల్‌ని బయటికి తీసిన ఘనత మాత్రం డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌కే దక్కుతుంది. అందుకే ఆయనే నభాకి ఇలియానా 2.0 అని నామకరణం కూడా చేసేశారు.

ఆ తర్వాత నుండీ పాప ఆ పేరుకు సార్దకత తీసుకొచ్చేలా తన కెరీర్‌ని మలచుకుంటోంది. గ్లామరస్‌ పాత్రల్లో తెగ మురిపిస్తోంది. 'డిస్కోరాజా' సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో జోడీ కట్టి, 'సోలో లైఫే సో బెటరూ' అనిపించబోతోంది. అలాగే మెగా ప్రిన్స్‌ని 'బాక్సర్‌'గా చూపించబోతోంది కూడా. అంటే ఈ సినిమాల్లో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోందన్న మాట. ఇంకేముంది ఏకంగా రెండు మెగా సినిమాలు తన ఖాతాలో వేసేసుకుంది.

 

ఇవి కాక మరిన్ని ప్రాజెక్టులు నభా చేతికి చిక్కనున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అప్పుడప్పుడూ తన గ్లామర్‌ యాంగిల్స్‌ని నెట్టింట్లో ఎగ్జిబిషన్‌కి పెట్టేస్తోంది. అలా లేటెస్ట్‌గా నభా ఎగ్జిబిషన్‌ స్టాల్‌ నుండి ఓ పిక్‌ బయటికి వచ్చి సందడి చేస్తోంది. పింక్‌ కలర్‌ చోళీలో నభా గ్లామర్‌ ఆటిట్యూడ్‌ చూపిస్తోన్న ఫోటో అది. కాస్త వంపుగా నిలబడి క్లీవేజ్‌ సోయగాల్ని బాగానే సేల్‌ చేస్తోంది. ఇంకెందుకాలస్యం ఈ ఘాటు సోయగాలపై చిన్నగా ఓ లుక్కేస్కోండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS