పెళ్లి ముచ్చట సరే, సినిమా సంగతేంటీ.?

మరిన్ని వార్తలు

ఈ మధ్య నితిన్‌ పెళ్లి వార్త టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన సినిమా ముచ్చట కన్నా, పెళ్లి ముచ్చట పైనే మీడియా కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. 'కళ్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు..' కానీ, మీడియాలో నితిన్‌కి పెళ్లి కళను తెచ్చేశారు. అయితే, తన పెళ్లి వార్తలపై నితిన్‌ ఇంతవరకూ ఎక్కడా స్పందించిందే లేదు. మీడియా ముఖంగా త్వరలోనే నిశ్చితార్ధం, ఏప్రిల్‌లో పెళ్లి అంటూ టాక్‌ హోరెత్తిపోతోంది. షాలినీ అనే అమ్మాయితో నితిన్‌ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడనీ, ఆ ప్రేమ పెద్దల వరకూ చేరి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కబోతోందనీ, దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి నితిన్‌ కుటుంబ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారనేది ఈ వార్తల సారాంశం.

 

నితిన్‌ ఓ ఇంటి వాడయితే మంచిదే. కానీ, మరీ ఈ ముచ్చట ఇంతలా అరగదీసి అరగదీసి డప్పు కొట్టడమే ఏమంత బాగా లేదనేది సోషల్‌ ముంగిట నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రస్తుతం నితిన్‌ నటిస్తున్న 'భీష్మ' సినిమా షూటింగ్‌లో నితిన్‌ బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్‌కి ముస్తాబవుతోంది. సో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్‌ రేపో మాపో మీడియా ముందు దర్శనమివ్వక తప్పదు. అప్పుడిక నితిన్‌ స్వయంగా తన పెళ్లి ముచ్చటను రివీల్‌ చేయక తప్పదుగా..తప్పదుగా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS