డామినేటింగ్‌ మోడ్‌లో ఇస్మార్ట్‌ గాళ్‌!

మరిన్ని వార్తలు

'నన్ను దోచుకుందువటే..' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసి, 'ఇస్మార్ట్‌ శంకర్‌' తో సూపర్‌ హిట్‌ కొట్టేసి, ఆ తర్వాత కూడా వరుస అవకాశాలతో బిజీగా దూసుకెళ్లిపోతున్న ముద్దుగుమ్మ నభా నటేష్‌పై ఓ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం నభా నటేష్‌ రవితేజతో 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు, మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో 'సోలో బతుకే సో బెటర్‌' అనే సినిమాకి సైన్‌ చేసింది. మరిన్ని కొత్త ఆఫర్లు చర్చల దశలో ఉన్నాయి ఈ పాపకి. అయితే, ఈ లోగా ఓ గాలి వార్త నభా నటేష్‌పై చక్కర్లు కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాలో నభా నటేష్‌ నటించాల్సి ఉందట.

 

సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం డైరెక్టర్‌ సంతోష్‌ నభాని సంప్రదించగా, తన పాత్ర నిడివితో పాటు, ఇంపార్టెన్స్‌ కూడా పెంచాలని డైరెక్టర్‌కి సూచించిందట. అయితే అందుకు అవకాశం లేని డైరెక్టర్‌ అందుకు అంగీకరించకపోవడంతో, నభా ఆ ఆఫర్‌ని తిరస్కరించిందట. దాంతో చేసేదేం లేక సంతోష్‌ వేరే హీరోయిన్‌పై ఫోకస్‌ పెట్టాడట.

 

ఇదీ సంగతి. అయితే, ఇప్పుడిప్పుడే కెరీర్‌ని బిల్డప్‌ చేసుకుంటున్న నభా నటేష్‌ ఇలా ప్రవర్తిస్తుందా? మొదట హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే, ఎలాంటి ఆఫర్‌ అయినా అంది పుచ్చుకోవాలి. అయితే, ఈ తరం హీరోయిన్లు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారే తప్ప, ఏ క్యారెక్టర్‌ పడితే ఆ క్యారెక్టర్‌లో నటించేందుకు ఇష్ట పడడం లేదు. ఆ లిస్టులో నభా నటేష్‌ మొదటి వరుసలోనే ఉంటుంది మరి. ఒకవేళ నభా నటేష్‌ అలా ఈ ఆఫర్‌ని రిజెక్ట్‌ చేసిందో ఏమో కానీ, అసలింతకీ ఈ గాపిస్‌లో నిజమెంతో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS