పక్కింటమ్మాయ్ అనే ఇమేజ్ అందరికీ వర్కవుట్ కాదు. ఏదో నిత్యా మీనన్, సాయి పల్లవి వంటి మోస్ట్ టాలెంటెడ్ గాళ్స్‌కి తప్ప. టాలెంట్ అందరికీ లేదని చెప్పలేం కానీ, టాలెంట్ ఉన్నా, వారిలా అన్నిసార్లూ టైమ్ కలిసి రావాలి కదా.. అలాగే 'చిలసౌ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. తొలి సినిమా కదా.. అని ట్రెడిషనల్‌గా కనిపించింది కానీ, పాపలో అందరికీ తెలియని హాట్ యాంగిల్ ఉందన్న సంగతి ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం బాగానే చేస్తోందిలెండి. ప్రయత్నాలు ఫలించినట్లే. అవకాశాలు కూడా బాగానే దక్కించుకుంటోంది.
ప్రస్తుతం నాని నిర్మాణంలో తెరకెక్కుతోన్న 'హిట్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. టైటిల్ పుణ్యమా అని తన ఖాతాలో మరో హిట్‌ని ముందే జమ చేసేసుకుందీ గడుసు పిల్ల. అలాగే హిందీలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ఓ మలయాళ థ్రిల్లర్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. తెలుగులో మరిన్ని అవకాశాలు రుహానీ కోసం ఎదురు చూస్తున్నాయట. ఇదిలా ఉంటే, పక్కింటమ్మాయ్ పాత్రలు తనకు వర్కవుట్ కావనుకుందో ఏమో కానీ, ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ సెగలు కురిపించేస్తోంది. హాట్ అండ్ సెక్సీ పోజులతో పిచ్చెక్కించేస్తోంది. ట్రెడిషనల్‌గా కన్నా, హాట్ అప్పీల్‌లోనే రుహానీ లుక్స్ సూపర్బ్ అంటూ నెటిజన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తోందట ఈ అందాల 'పెళ్లి కూతురు'.