'ఇస్మార్ట్ శంకర్' సినిమా ధాటికి వరుస ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి ముద్దుగుమ్మ నభా నటేష్ ఖాతాలోకి. ఇప్పటికే పాప చేతిలో రెండు మూడు ప్రాజెక్టులున్నాయి. లేటెస్ట్‌గా 'డిస్కోరాజ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలో సాయి ధరమ్ తేజ్‌తో 'సోలో లైఫే సో బెటరూ' సినిమాతో రాబోతోంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమాలో జత కడుతోంది. మదర్ ల్యాండ్ కన్నడలోనూ బిజీగానే గడుపుతోందనుకోండి. ఇదంతా బాగానే ఉంది. కానీ, పాపపై హాట్ హాట్‌గా కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఏంటా రూమర్లు.? అంటే, ఇంకేముందండీ కాస్త బిజీ అనిపిస్తే చాలు, రెమ్యునరేషన్ లొల్లి మొదలైపోతూంటుంది.
అదే ఈ పాప విషయంలో కూడా జరుగుతోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడి ముద్దుగుమ్మల విషయంలో బాగా వర్తిస్తూ ఉంటుంది. అయితే, మరీ ఎక్కువగా చక్కబెట్టేయాలనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండోయ్. ప్రస్తుతం నభా నటేష్ విపరీతంగా రెమ్యునరేషన్ పెంచేసిందనే వార్తలు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తల విషయంలో చక్కనమ్మలు కాస్త స్పీడుగా రెస్పాండ్ అయితే బాగుంటుంది. లేదంటే కష్టపడి తెచ్చుకున్న క్రేజ్‌కి త్వరలోనే మంగళం పాడేయగలరు. మరి మన ఇస్మార్ట్ బ్యూటీ స్మార్ట్‌గా ఆలోచించి ఈ రూమర్స్‌కి చెక్ పెడుతుందేమో చూడాలి మరి.