తమిళ తంబీల్ని ఇంప్రెస్‌ చేస్తానంటోన్న పూరీ 'పోరీ'.

మరిన్ని వార్తలు

పూరీ కంపెనీలో జాయిన్‌ అయితే, హీరోలే కాదు, హీరోయిన్స్‌ తీరు కూడా మారిపోతుంది. పూరీ సినిమాకి ముందు, పూరీ సినిమా తర్వాత అన్నట్లుగా హీరో, హీరోయిన్స్‌ని మాట్లాడుకోవాలి. తాజాగా పూరీ సినిమాతో గ్లామర్‌ కేక పుట్టించిన నభా నటేష్‌, త్వరలో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఓ బిగ్‌ హీరో సినిమాతో నభా కోలీవుడ్‌లో అడుగు పెట్టబోతోందట. అయితే, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌ వివరాలు తెలియవు కానీ, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందట.

 

ఇప్పటికే కన్నడలో పలు చిత్రాల్లో నటించిన నభా నటేష్‌ తెలుగులో 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత రవిబాబు సినిమాలో నటించినా, అంతగా పేరు రాలేదు. ముచ్చటగా మూడో సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో వరంగల్‌ పోరిగా మాస్‌ డైలాగులు ఇరగదీసేసి, మాస్‌ పల్స్‌ని బాగా పట్టేసింది. దాంతో నభాకి క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. తెలుగులోనూ పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట.

 

అయితే, పూరీ స్టైల్‌లో మాస్‌ ఊరమాస్‌ క్యారెక్టర్స్‌ బహుశా తెలుగులో మళ్లీ రాకపోవచ్చు నభా నటేష్‌కి. కానీ, అమ్మడిలో మంచి నటి దాగుంది. ఆ నటికి నటనే కాదు, ఎక్స్‌పోజింగ్‌ కూడా ఓకే.. అని 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో ప్రూవ్‌ అయిపోయింది. సో ఎలాంటి క్యారెక్టర్‌నైనా డీల్‌ చేయగల స్టామినా నభాకుందని దర్శక, నిర్మాతలకు ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది. చూడాలి మరి, ఈ క్రేజ్‌తో నభా ఎన్ని అవకాశాలు దక్కించుకుంటుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS