బిగ్‌హౌస్‌లో తమన్నా పని ఏంటంటే!

మరిన్ని వార్తలు

ఓ ట్రాన్స్‌జెండర్‌ని బిగ్‌హౌస్‌లోకి పంపించడమంటేనే అందర్నీ విస్మయపరిచింది. అయితే, తమన్నాను హౌస్‌లోకి ఎందుకు పంపించారా.? అనే ప్రశ్నపై పలు సమాధానాలు తలెత్తుతున్నాయి. వస్తూ వస్తూ తమన్నా వరుణ్‌, వితకలను ఓ ఆట ఆడిస్తానంది. వరుణ్‌, వితికలతో పాటు, హౌస్‌మేట్స్‌ అందర్నీ ఆట ఆడించేలా ఉందిప్పుడు. రీజన్‌ లేకుండా తమన్నా రియాక్షన్స్‌ హౌస్‌లో మిగిలిన వాళ్లందర్నీ విస్తుపోయేలా చేస్తున్నాయి.

 

నోటికొచ్చినట్లు మాటలు అనడం, తర్వాత సారీ చెప్పడం తమన్నాకి వెన్నతో పెట్టిన విద్య కాబోలు అనిపిస్తోంది. సారీ చెప్పాక, మళ్లీ సేమ్‌ రియాక్షన్‌. మొన్నేమో అలీని బాగా కెలికింది. ఇప్పుడు తమన్నా ఫోకస్‌ రవికృష్ణపై పడింది. రవిని నిన్న మొన్నటి వరకూ 'పండూ.. పండూ..' అంటూ ముద్దుగా పిలుచుకుని, ఆట పట్టించిన తమన్నా, ఇప్పుడు అనరాని మాటలతో ఎగతాళి చేస్తోంది. అసభ్యకరమైన పదజాలం వినియోగిస్తూ, హౌస్‌లో వెకిలి చేష్టలు చేస్తోంది. పండు కాస్తా పప్పు అయిపోయాడు.

 

నువ్వు పప్పు.. పప్పు అంటూ పదే పదే వెక్కిరిస్తోంది. అంతదాకా ఆగలేదు. తను ఓ ట్రాన్స్‌ అంటూ నోరు జారేసింది. ఎన్ని మాటలన్నా, హౌస్‌మేట్స్‌ తమన్నా విషయంలో చాలా కామ్‌గా, జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ, తమన్నా మాత్రం తనదైన శైలిలో హౌస్‌మేట్స్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS