'గబ్బర్‌సింగ్' సినిమాతో హీరోయిన్ శృతిహాసన్ ఫేట్ మారిపోయింది. ఒక్క హిట్‌తో స్టార్ హీరోయిన్ లెవల్ అందుకుంది. ఆ తర్వాత శృతిహాసన్ వెనక్కి తిరిగా చూడలేదు. వరుస ఆఫర్లతో దూసుకెళ్లిపోయింది. ఎన్నో సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్ని కూడా దున్నేసింది. కానీ ఫేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. మళ్లీ శృతి కెరీర్‌కి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ నుండి శృతి కోలుకోవడానికి చాలానే టైం పట్టింది.
లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఈ మధ్యనే మళ్లీ ఓ తమిళ చిత్రంతో శృతి రీ ఎంట్రీ బిగిన్ అయ్యింది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న 'లాభం' సినిమాతో శృతి హాసన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తెలుగులోనూ ఆమె సందడి చేయనుంది. ఇదిలా ఉంటే, తాజాగా మంచు లక్ష్మి నిర్వహిస్తున్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' ప్రోగ్రాంలో శృతిహాసన్ పాల్గొంది. ఈ సందర్భంగా, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన మాటల్ని అభిమానులతో పంచుకుంది.
తాను చాలా ఇన్నోసెంట్ అనీ, ఎవరినైనా ఈజీగా నమ్మేస్తాననీ, అలా తన లైఫ్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్‌ని కోల్పోయాననీ చెప్పుకొచ్చింది. అయితే, జీవితం కొన్ని పాఠాలు నేర్పించిందనీ, జీవితాంతం ఆ పాఠాల్ని గుర్తు పెట్టుకుంటాననీ చెబుతోంది. గత కొంత కాలంగా తన ప్రియుడు మైఖేల్‌తో పీకల్లోతు ప్రేమలో పడి మునిగి తేలిన శృతిహాసన్, ఈ మధ్య లవ్ బ్రేకప్ చేసుకుని కెరీర్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.