భంచిక్ భంచిక్ చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా.. అంటూ రమ్యకృష్ణ ఓ సినిమాలో బీభత్సమైన సాంగేసుకోవడం చూశాం. ఇప్పుడు హీరోయిన్లలో చాలామంది యోగానే ఫాలో అవుతున్నారు ఫిట్‌గా వుండేందుకు. యోగాతో ఫిట్‌నెస్ మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా.. అంటూ ప్రపంచ దేశాలు యోగాని ప్రమోట్ చేస్తున్న విషయం విదితమే. అసలు విషయమేంటంటే, కరోనా వైరస్ దెబ్బకి చాలామంది హీరోయిన్లు, హీరోలు ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్నారట. సినిమా షూటింగుల్లేకపోవడం ఓ ఎత్తు.. పూర్తిగా ఇంటికే పరిమితమవడం ఇంకో ఎత్తు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ కోసం అందరూ యోగానే ఆశ్రయిస్తున్నారు. ఆ లిస్ట్‌లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా చేరిపోయింది.
ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలతో బిజీగా వున్న నభా నటేష్, గత కొద్ది రోజులుగా షూటింగులు లేకపోవడంతో కాస్త బొద్దుగా తయారైందట. ఆ బొద్దుతనం తగ్గి, మళ్ళీ స్లివ్‌ు అవడం కోసం యోగా చేస్తోందట.. అదీ వీలైనన్ని ఎక్కువసార్లు చేసేస్తోందట రోజులో. యోగా ఒక్కటే కాదు, వర్కవుట్స్‌లోనూ మునిగి తేలుతోందట నభా నటేష్. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ కొట్టిన నభా నటేష్, ఈ మధ్యనే రవితేజతో ‘డిస్కో రాజా’ సినిమా చేసిందిగానీ, ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో డీలాపడింది.