ప్రభాస్ ఇమేజ్ పెద్దది. తన అభిమాన గణం పెద్దది. తన క్రేజ్ ఆకాశమంత. తన మనసు కూడా అంతే పెద్దది. ఆ మాటకొస్తే ప్రభాస్ మనసు.. బాహుబలి కంటే బహు పెద్దది. కరోనాపై పోరాటం కోసం ఇప్పటికే నాలుగు కోట్ల సహాయం ప్రకటించాడు ప్రభాస్. ఇప్పుడు మరో రూ.50 లక్షలు జోడించాడు.
కరోనాపై పోరాటం చేయడానికి కేంద్రానికి మూడు కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలకూ కలిపి కోటి రూపాయల సహాయం అందించిన ప్రభాస్.. ఇప్పుడు మరో రూ.50 లక్షలు ప్రకటించాడు. ఈ మొత్తాన్ని సీసీసీ (కరోనా క్రైసెస్ ఛారిటీ) కోసం వెచ్చించాడు. టాలీవుడ్ లో ఏ ఇతర కథానాయకుడూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం అందించలేదు. అందుకే సర్వత్రా ప్రభాస్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ ది రియల్ బాహుబలి అంటూ కొనియాడుతున్నారు. ఈ పొగడ్తలన్నింటికీ ప్రభాస్ అర్హుడు కూడా.