వెంకీ, నాగ్‌ చెలరేగిపోయారంతే!

మరిన్ని వార్తలు

నాగ చైతన్య, సమంతల వివాహం నిన్న హిందూ సాంప్రదాయంలో జరిగింది. పెళ్లికూతురుగా పట్టుచీరలో సమంత అందాలు, పంచెకట్టులో నాగ చైతన్య జంట చూడ చక్కగా ఆకట్టుకుంది. పెళ్లి ముడితో ఈ ఇద్దరు ప్రేమ పక్షులు ఒక్కటయ్యారు. గోవాలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు దగ్గుబాటి ఫ్యామిలీ పాల్గొని సందడి చేశారు. పెళ్లికి ముందు జరిగిన మెహందీ కార్యక్రమంలో దగ్గుబాటి సురేష్‌బాబు, సమంతతో కలిసి చిందేసిన స్టెప్పులు స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యాయి. ఆ తర్వాత బావ బావమరుదులు నాగార్జున, వెంకటేష్‌లు కూడా ఈ వేడుకలో చిందేశారు. చెలరేగిపోయి డాన్సులేశారు. నువ్వా నేనా అన్నట్లుగా వెంకటేష్‌, నాగార్జున డాన్సులు ఇరగదీసేశారు. సమంత, చైతూ, కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరదా సరదాగా ఈ వేడుక జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం క్రిస్టియన్‌ సాంప్రదాయంలో చర్చిలో ఈ ఇద్దరూ ఒక్కటి కానున్నారు. అందుకోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వెడ్డింగ్‌ వేర్‌లో సమంత, చైతూ మెరిసిపోనున్నారు. ఆ తర్వాత హైద్రాబాద్‌లో రిసెప్షన్‌కి ప్లాన్‌ చేయనుంది అక్కినేని ఫ్యామిలీ. ఈ రిసెప్షన్‌కి ఎక్కువ సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేయనున్నారనీ సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS