మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చ్ 1ST న రిలీజ్ కానుంది. వరుణ్ కెరియర్లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం హిందీ లో సల్మాన్ ఖాన్, తెలుగులో రామ్ చరణ్ రంగంలోకి దిగి వరుణ్ కి సపోర్ట్ గా నిలిచారు. నాగ్ బాబు కూడా వరుణ్ సినిమా గూర్చి అడపా దడపా కామెంట్స్ చేస్తూ ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచుతున్నారు. అయితే ప్రజంట్ నాగబాబు మూవీ మేకర్స్ కి క్షమాపణలు చెప్తూ X వేదికగా ఒక నోట్ రిలీజ్ చేశారు.
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ, క్షమాపణ నోట్ పోస్ట్ చేశారు. ‘పోలీస్ పాత్ర 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు అని ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఎవరైనా వాటికి నొచ్చుకొని ఉంటే క్షమించండి. అవి యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ. కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. వరుణ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, 'హైట్ కి సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న పోలిక చేశారని, ఏ హీరోను కించపరిచే ఉద్దేశం లేదని' స్పష్టం చేశారు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ 2019లో జరిగిన పుల్వామా దాడికి చెందిన కథే ఈ సినిమా. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని శక్తిప్రతాప్ సింగ్ హడా డైరక్ట్ చేశారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మార్చ్ 1ST న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.