'బాల‌య్య‌'పై నాగ‌బాబు మ‌రో పంచ్‌.. ఫొటోని కూడా చూపించాడు.

మరిన్ని వార్తలు

'బాల‌య్య అంటే ఎవ‌రో తెలీదు' అంటూ... ఒక్క‌సారిగా క‌ల‌క‌లం  రేపాడు నాగ‌బాబు. `యూ ట్యూబ్` ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగ‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఒక్క‌సారిగా సంచ‌ల‌నం సృష్టించాయి. మొన్నా మ‌ధ్య కె.ఏ. పాల్ కూడా ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చిన వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్ అయ్యింది. బ‌హుశా... నాగ‌బాబు కూడా ఆ ఉద్దేశ్యంతోనే `బాల‌య్య ఎవ‌రో తెలీదు` అన్నాడేమో అనుకున్నారంతా. అయితే..  ఈ ఎపిసోడ్‌ని నాగ‌బాబు ఇంకాస్త కామెడీ చేసేశాడు.

ఈరోజు నాగ‌బాబు మ‌రో వీడియో విడుద‌ల చేశాడు. 'యూ ట్యూబ్ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య ఎవ‌రో తెలీదు అన్నాను. అది నా త‌ప్పిద‌మే. పొర‌పాటు అయ్యింది' అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు. అక్క‌డితో ఆగితే.. ఈ ఎపిసోడ్‌కి పుల్ స్టాప్ ప‌డిపోయిన‌ట్టు అవుదును. దాన్ని కొన‌సాగిస్తూ.. ఇంకో పంచ్ ఇచ్చాడు. 'బాల‌య్య నాకు తెలీక పోవ‌డం ఏమిటి?  ఆయ‌న మంచి క‌మెడియ‌న్‌.. క‌డుపుబ్బా న‌వ్విస్తారు` అంటూ బాల‌య్య ఫొటోని కూడా చూపించాడు.

అది... 'వ‌ల్లూరి బాల‌కృష్ణ‌' అనే కమెడియ‌న్ ఫొటో. అంటే... దాన‌ర్థం ఏమిటి? వ‌ల్లూరి బాల‌కృష్ణ అనే పాతత‌రం క‌మెడియ‌న్ గురించి తెలుసుగానీ, ఇప్ప‌టి నంద‌మూరి బాల‌కృష్ణ గురించి తెలీదు అనే క‌దా?! ఇదంతా బాల‌య్య‌నీ, ఆయ‌న అభిమానుల్నీ క‌వ్వించే ప్ర‌య‌త్న‌మే. మొన్న‌టి వీడియో ఎంత‌టి వైర‌ల్ అయ్యిందో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS