నందమూరి తారకరామారావు అన్న పేరు కంటే, ఎన్టీఆర్ అన్న పేరు ఇంకా ఎక్కువ పాపులర్. 'ఎన్టీవోడు' అంతలా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ముద్ర వేశారు మరి. ఆయన బయోపిక్ అంటే ఆషామాషీ కాదు కదా.! అందుకే, ప్రతీ డీటెయిల్నీ ఇంకా డీటెయిల్డ్‌గా చూపిస్తూ, 'ఎన్టిఆర్ బయోపిక్'ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సెకెండ్ సింగిల్ రిలీజ్ డేట్‌ని కన్ఫామ్ చేసింది 'ఎన్టిఆర్ బయోపిక్' టీమ్. 'రాజర్షి..' అంటూ సాగే ఆ సింగిల్ రేపే విడుదల కాబోతోంది.
దీనికి సంబంధించి ఓ ఫొటో విడుదల చేశారు. అందులో, ఎన్టీఆర్ - తెలుగుదేశం పార్టీ లోగోని డిజైన్ చేస్తున్నట్టుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నా, ఏ ఫొటోలోనూ బాలయ్య కన్పించడంలేదు.. అందరికీ ఎన్టీఆర్ మాత్రమే కన్పిస్తున్నారంటే ఆ పాత్రని దర్శకుడు క్రిష్ ఎంత బాగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెలలో 'ఎన్టిఆర్ బయోపిక్' రెండు పార్టులుగా విడుదల కాబోతోన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో,
'ఎన్టిఆర్ బయోపిక్' నిర్మాణం మరింత వేగం పుజుకుంది. ప్రమోషన్స్ కూడా షురూ అవబోతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు లుక్స్, వాటితోపాటుగా సింగిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఉత్కంఠని పెంచేస్తున్న సంగతి తెల్సిందే. స్వర్గీయ ఎన్టీఆర్ అంటే సినిమా నటుడు మాత్రమే కాదు, తెలుగునాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహా నాయకుడు.