ఆమధ్య నందమూరి బాలకృష్ణకూ, నాగబాబు కి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడిచింది. బాలయ్యని ఉద్దేశించి నాగబాబు చేసిన కామెంట్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఆ తరవాత... నాగబాబుపై కూడా బాలయ్య పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇదంతా.. సినీ అభిమానులకు గుర్తే. దాంతో బాలయ్య - నాగబాబు మధ్య ఏదో జరుగుతోందని అనిపించింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారని టాక్.
బాలయ్య తో ఆహా `అన్ స్టాపబుల్` అనే షో ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళికి ఈ షో.. లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ షోలో టాలీవుడ్ సెలబ్రెటీలతో చిట్ చాట్ చేయబోతున్నాడు బాలయ్య. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు అయిపోయాయట. అందులో నాగబాబు ఫ్యామిలీ కూడా ఉందని తెలుస్తోంది. వరుణ్ తేజ్, నిహారిక, నాగబాబులు కలిసి ఓ ఎపిసోడ్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. నాగబాబుని ఉద్దేశించి బాలయ్య కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నులు అడగడం, దానికి నాగబాబు ఫన్నీగా సమాధానం చెప్పడం ఆకట్టుకుంటాయని సమాచారం. ఈ షోలో క్రిష్, పూరి జగన్నాథ్ తదితర దర్శకులు నాని, రానాలాంటి హీరోలూ పాల్గొన బోతున్నార్ట.చిరంజీవితో ఓ ఎపిసోడ్ చేశారని, అది ఈ షోకే హైలెట్ గా నిలవబోతోందని టాక్.