జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. నాగబాబు ఎప్పుడైతే ఈ షోకి గుడ్ బై చెప్పారో, అప్పుడే ఈ షో కళ పోతుందని అంతా భయపడ్డారు. అంతేకాదు.. నాగబాబుతో పాటు చాలామంది జబర్దస్త్ కామెడియన్లు ఈ షోకి గుడ్ బై చెబుతారనుకున్నారు. అయితే అలాంటిదేం జరగలేదు. నాగబాబు వెనుక వెళ్లడానికి ఎవ్వరూ రెడీగా లేరని తెలుస్తోంది. ఛమ్మక్ చంద్ర, ఆర్పీ నాగబాబు వెంట వెళ్లడానికి రెడీ అయినా, వాళ్లు ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చేసే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్.
జబర్దస్త్ వదిలేస్తే.. ఎంత నష్టపోతారన్నది కమెడియన్లకు బాగా తెలుసు. ఈ పేరు చెప్పుకునే సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సినిమాల్లో చేసినా రాని మొత్తం ఆర్జిస్తున్నారు. ఇలాంటి కల్పతరువుని ఎవరు వదులుకుంటారు? అందుకే నాగబాబు టెమ్ట్ చేస్తున్నా, జబర్ దస్త్ టీమ్ కదలడం లేదని తెలుస్తోంది. సో.... నాగబాబు వెంట ఎవరూ వెళ్లనట్టే.