సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి దిమ్మ తిరిగే ట్రీట్ ఇచ్చాడు టీజర్‌తో. ఊరించి ఊరించి వదిలిన 'సరిలేరు నీకెవ్వరూ..' టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అనూహ్యంగా ఉంది టీజర్. పవర్ ఫుల్ డైలాగ్స్, థ్రిల్లింగ్ అప్పియరెన్స్‌తో సూపర్ స్టార్ అదరగొట్టేశాడు. ఆ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చిన్నపాటి ట్రైలర్‌ని తలపించింది టీజర్. 'భయపడే వాడే బేరాలాడతాడు.. ఇక్కడ బేరాలాడటాల్లేవమ్మా..' అంటూ మహేష్ బాబు ఎగ్రెసివ్‌గా చెప్పిన డైలాగ్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ఆర్మీ గ్రౌండ్‌లో స్టార్ట్ అయిన టీజర్ రాయలసీమ వరకూ కంటిన్యూ అయ్యింది. 'గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు బాబాయ్..' అంటూ విజయ శాంతి చేత చెప్పించిన డైలాగ్, సంక్రాంతికి అల్లుళ్లు వస్తారనుకుంటే, మొగుడొచ్చాడు..' అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ టీజర్‌కి హైలైట్ అయ్యాయి. కొండా రెడ్డి బురుజు సెట్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
టోటల్‌గా సంక్రాంతికి సూపర్ స్టార్ అల్లుడు కాదు, కోడి పుంజూ కాదు. అసలు సిసలు మొగుడే అవుతాడని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు. టీజర్ వచ్చాక ఫ్యాన్స్‌లో కాస్తో కూస్తో ఉన్న అనుమానాలన్నీ పటా పంచలైపోయాయి. కొడతాడ్రా మనోడు గట్టిగా కొడతాడంతే.. అనే కాన్ఫిడెన్స్‌కి వచ్చేశారు.