మెగా బ్రదర్ నాగబాబు సంచలనమైన కామెంట్స్ చేశారు . ఆర్ఆర్ఆర్ సినిమాపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ పై ఘాటుగా మోటుగా స్పందించారు ‘’ నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కోసం . ఆర్ఆర్ఆర్ మీద చేసిన కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం' అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల తమ్మారెడ్డి ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆస్కార్ అవార్డ్ కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో మేము 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం’’ అని కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరుగుతుంది. అయితే నాగబాబు తన కామెంట్ లో వైసీపీ ని కూడా చేర్చడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ వర్గాల సోషల్ మీడియా నుంచి కూడా దారుణమైన కామెంట్స్ పలకడానికి రాయడానికి వీలులేని మాటలతో ఎదురుదాడి మొదలైయింది.