నాగబాబు వివాదంలో చిక్కుకున్నారు. అందులోంచి ఎప్పుడు ఎలా బయటపడతారో తెలీదు గానీ, ప్రస్తుతం ఆయన ఆ తలనొప్పుల్ని భరిస్తున్నారు. గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. గాంధీని చంపిన గాడ్సేని దేశభక్తుడు అంటావా? అంటూ ఆయనపై విమర్శలకు దిగుతున్నారంతా. ఇందులో రాజకీయ కుట్ర ఉందని కూడా మండి పడుతున్నారు.
జనసేన - భాజాపాలో విలీనం కానుందని అందుకే, ఇలాంటి వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారని, ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందించాలని రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగారు నాగబాబు. ట్విట్టర్‌లో గాడ్సే గురించి తాను చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతం అని, ఆ వ్యాఖ్యలకు జనసేన పార్టీకి గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ, ఎలాంటి సంబంధం లేదని మరో ట్వీట్‌లో స్పష్టం చేశారు. సో... ఈ వ్యాఖ్యల్ని నాగబాబు కోణంలోనే చూడాలన్నమాట. తాజా ట్వీటుతో చిరు, పవన్‌లపై పడిన భారాన్ని నాగబాబు కాస్త తగ్గించినట్టైంది. కానీ విమర్శకులకు ఈ సమాధానం సంతృప్తి ఇస్తుందో, లేదో?
ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ..contd pic.twitter.com/WNIpG6gsVO
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 19, 2020
దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 19, 2020
Whatever i tweet on anything,it's my personal responsibility.janasena party or any of my family has no involvement in my opinion
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 20, 2020