సమంత రిటైర్మెంట్ పై ఘాటుగా స్పందించిన చైతు..!

మరిన్ని వార్తలు

గత కొన్నిరోజులుగా సమంత సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టుగా వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ వార్తల పై ఆమె ఏమి స్పందించకపోవడంతో సదరు వార్తలకి మరింత ప్రాధాన్యం లభించింది.

ఇక ఈ అంశం పైన హీరో, సమంత భర్త అయిన నాగ చైతన్య స్పందించడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే- సమంత కి నటన అంటే చాలా ఇష్టం అని అటువంటిది ఆమె సినిమాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా వస్తున్న వార్తాల్లో నిజం లేదు అని చెబుతూ, అయితే ఆమె ఇంతకముందులా ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు, ఆమె నటించబోయే సినిమాల సంఖ్య తగ్గొచ్చు అని చెప్పాడు.

ఎందుకంటే పెళ్ళి తరువాత అనేక బాధ్యతలు పెరిగే సందర్భంలో ఆమె సినిమా సినిమాకి మధ్య కొంత విరామం అయితే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ క్లారిటీతో సమంత సినిమాలకి గుడ్ బై చెప్పబోతోంది అన్న వార్తలకి బ్రేక్ పడినట్టే అని చెప్పొచ్చు.

ఈ వార్త సమంత అభిమానుల్లో కచ్చితంగా ఆనందాన్ని నింపుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS