‘అతి’ ప్రమోషన్స్ తగ్గించిన నాగచైతన్య

మరిన్ని వార్తలు

నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా మే12న వస్తోంది. అంటే సరిగ్గా మూడు రోజులే వుంది. ఇప్పటికే ప్రిరిలీజ్ ఈవెంట్ కూడా చేసేశారు. ఈ మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్లు అంటే హీరోల జాతరలా తయారైయ్యాయి. ఒక నిర్మాణ సంస్థ ఈవెంట్ చేసిందంటే .. ఆ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న, అడ్వాన్స్ ఇచ్చిన సినిమాల హీరోలు, దర్శకులు, హీరోయిన్ లు ఇలా ఈవెంట్ కి క్యూ కట్టేయడం రివాజుగా మారింది. ఈవెంట్ కి వచ్చారు కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మైక్ పట్టుకొని ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ ఒక కామన్ డైలాగు చెప్పి స్టేజ్ దిగిపోవడం చూస్తూనే వున్నాం. 


అయితే ఈ హడావిడిని తగ్గించేశాడు నాగచైతన్య. కస్టడీ  ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా సైలెంట్ గా చేశారు. నాగచైతన్య సినిమా ఈవెంట్ కి అతిధుల కొరత లేదు. అయితే ఈసారికి వద్దు అనుకున్నాడు చైతు. కస్టడీ కంటెంట్ పై తనకి నమ్మకం వుంది. అందుకే తనవల్ల సాధ్యపడినంత ప్రమోషన్ ఒక్కడే చేసుకుంటున్నాడు.


 ఈ మధ్య అఖిల్ సినిమాకి చివర్లో ఓవర్ ప్రమోషన్ అయ్యింది. అది కూడ కలసిరాలేదు. ఈ అనుభవాలన్నీ ద్రుష్టిలో పెట్టుకొని ప్రమోషన్స్ విషయంలో బ్యాలెన్స్ గా వెళ్తున్నాడు చైతు. కంటెంట్ బావుంటే చూడాల్సిన ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారనే నమ్మకం చైతుది. మరి చూడాలి ..కస్టడీ విషయంలో ఏం జరుగుతుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS