కొన్ని కొన్ని సార్లు మనం తీసుకున్న నిర్ణయాలు వల్ల మన కెరీర్ కి తెలియకుండానే మేలు జరుగుతుంటుంది. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు హీరో నాగ చైతన్య కి జరిగింది.
ఆ వివరాల్లోకి వెళితే, సాయి ధరం తేజ్ తాజాగా నటించిన ఇంటెలిజెంట్ చిత్ర కథ ఆ రచయత ఆకుల శివ ముందుగా నాగ చైతన్యకి వినిపించాడట. అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కి తగ్గ కథ కాదు అనే ఉద్దేశ్యంతో ఈ కథని వద్దని చెప్పేశాడట.
అయితే ఇదే కథని సాయి ధరం తేజ్ ఒకే చేయడం అలాగే దర్శకుడు వీవీ వినాయక్ కూడా దర్శకత్వం వహించడానికి ఒప్పుకునే సరికి అందరికి ఈ చిత్రం పైన అంచనాలు ఏర్పడాయి. కాకపోతే నిన్న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లాపడడంతో అందరికన్నా ముఖ్యంగా నాగ చైతన్య ఊపిరి పీల్చుకుని ఉంటాడు.
కథల విషయంలో తన ఎంపిక సరైనదిగా తేలడంతో ఆయన ఖుషి అయి ఉండొచ్చు. సాయి ధరం తేజ్ మాత్రం రొటీన్ కథని ఎంపిక చేసుకోవడంతో మూల్యం చెల్లించక తప్పలేదు.