నాగ చైతన్య జోరు చూస్తుంటే ఈ సంవత్సరం మధ్యలోకి రెండు చిత్రాలు రిలీజ్ చేసే ఆలోచనలో ఉనట్టు తెలుస్తుంది.
ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం వచ్చే నెల 19వ తారీఖున రిలీజ్ అవ్వనుంది. అలాగే తన తదుపరి చిత్రం #NC14 షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతుంది.
అందుతున్న వివరాల ప్రకారం, ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఫేస్ బుక్ ద్వారా షూటింగ్ పిక్స్ షేర్చేసింది.
ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తుండగా కృష్ణ ఆర్ వీ అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.