సోగ్గాడే చిన్నినాయన సినిమా కోసం నాగార్జునతో జోడీ కట్టింది లావణ్య త్రిపాఠీ. ఇప్పుడు నాగ్ తనయుడు నాగచైతన్యతో కలసిచిందులు వేయబోతోంది. నాగచైతన్య కథానాయకుడిగా వారాహి చలన చిత్రం సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కృష్ణ ఆర్‌వీ దర్శకుడు. ఈ చిత్రం ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి గుణ్ణం గంగరాజు క్లాప్ నిచ్చారు. కీరవాణి స్విచ్చాన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కథానాయికగా లావణ్య త్రిపాఠీని ఎంచుకొన్నారు. పెళ్లి చూపులు ఫేమ్ వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు చైతూ. ఆ సినిమా పూర్తవ్వగానే.. వారాహి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.