తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రం `మానాడు`. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింభు కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులోనూ డబ్ చేశారు కానీ విడుదల కాలేదు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేయాలని గీతా ఆర్ట్స్ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ సినిమా హక్కులు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ చేతిలో ఉన్నాయని టాక్. నాగచైతన్యతో ఈసినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలూ మొదలయ్యాయి.
వెంకట్ ప్రభునే ఈ తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మానాడులో విలన్ పాత్ర చాలా కీలకం. తమిళంలో ఎస్.జే సూర్య ఈ పాత్ర చేశాడు. తనతోనే ఈ పాత్ర తెలుగులో చేయిస్తే మరీ రొటీన్ అయిపోతుంది. పైగా.. సూర్య ఖరీదైన నటుడు. తన రెమ్యునరేషన్ తట్టుకోవడం కష్టం. అందుకే ఇప్పుడు సూర్య ప్లేసులో మరో విలన్ ని వెదికిపట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. సూర్య స్థాయికి తగ్గట్టుగానే ఓ మాజీ హీరోని విలన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ విలన్ దొరికితే.. `మానాడు` పట్టాలెక్కినట్టే.