నిజజీవితంలో కొత్త అధ్యాయానికి తన వివాహంతో తెర తీసిన అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని పట్టాలేక్కించే పనిలో ఉన్నాడు.
ఇక ఆ కొత్త చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ చిత్రానికి ఒక పక్కా మాస్ టైటిల్ ని పెట్టే యోచనలో దర్శకుడు ఉన్నట్టు సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే- శైలజ రెడ్డి అల్లుడు. ఇక ఆ టైటిల్ పాత్ర అయిన శైలజ రెడ్డిని ప్రముఖ నటి రమ్యకృష్ణ చేస్తున్నట్టు తెలిసింది.
చైతన్య కి అత్తగా కనిపించనుంది అన్న వార్తల నడుమ ఈ చిత్రం పైన అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొత్తానికి పక్కా మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న చైతుకి తన కెరీర్ లో ఇది ఒక పెద్ద కమర్షియల్ హిట్ అవ్వాలని కోరుకుందాం..
ఇక ప్రస్తుతం ఈ చిత్రం కాకుండా, చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చిత్రం చేస్తున్నాడు చైతు.