సమ్మోహనాన్ని వదులుకున్న చైతు?

మరిన్ని వార్తలు

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే నువ్వు ఉన్న ఫీల్డ్ లో విజయం సాధించే పరిస్థితి ఉంటుంది, అదే సినిమా ఫీల్డ్ లో అయితే పైన చెప్పింది సరిగ్గా సరిపోతుంది.

ఇక విషయానికి వస్తే, మోహనకృష్ణ ఇంద్రగంటి కొంతకాలం క్రితం నాగ చైతన్యకి సినిమా కోసం ఒక రెండు మూడు కథలు చెప్పడం వారిరువురు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చ్చాయి. అయితే కారణాలు తెలియదు కాని వీరి నుండి సినిమా ఏమి రాలేదు.

తాజాగా మోహనకృష్ణ సమ్మోహనం విడుదల కావడం మంచి విజయం సాధించడం చూసాము. దీనితో ఇప్పుడు నాగ చైతన్యవదులుకున్న సినిమా ఇదేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి దర్శకుడు మోహనకృష్ణ ని కొంతమంది సంప్రదిస్తే, తాను ఒక రెండు మూడు కథలు చెప్పాను అని అయితే అందులో ఇది ఉందా లేదా అనేది తనకి గుర్తులేదని చెప్పాడట.

మొత్తానికి చైతు వదులుకున్నది ఇదేనా కాదా అన్నది తేలనప్పటికి ఒకవేళ ఇదే  గనుక అయితే ఒక మంచి చిత్రం మిస్ అయ్యాడు అనే చెప్పాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS